News March 29, 2025
రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉగాది వేడుకలు

ఉగాది ఉత్సవాలను ఆదివారం ఉదయం గం.10.30ల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఎపీహెచ్‌ఆర్‌డీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 4, 2025
జూబ్లీ బైపోల్: ఒకే ఎమ్మెల్యే.. ఎక్కడా తగ్గట్లే

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ మొత్తం ఇక్కడే మోహరించింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు.. ఇక్కడ గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 2ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎలక్షన్‌ను రెఫరెండంగా భావిస్తోంది. ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ సర్కారును ప్రజలు ఆమోదించినట్లేనని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ గెలుపుకోసం ఆరాటం.
News November 4, 2025
ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి జరిగితే మేమొస్తాం: బీజేపీ

తన కొడుకు పెళ్లి అన్నట్లుగా బిహార్‌లో ప్రధాని మోదీ తిరుగుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇది రాజకీయ దిగజారుడుతనమని మండిపడింది. రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి సెటైర్లు వేసింది. ‘ఖర్గేజీ మీ కాంగ్రెస్ యువరాజు (రాహుల్) పెళ్లి ఎప్పుడైనా జరిగితే మేం కచ్చితంగా హాజరవుతాం’ అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
News November 4, 2025
శ్రీరాంపూర్: గుర్తింపు సంఘం వైఫల్యంతోనే సమస్యలు

గుర్తింపు సంఘం వైఫల్యం, యాజమాన్యం మొండి వైఖరి కారణంగా సింగరేణిలో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఐఎన్టీయూసీ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ విమర్శించారు. గత 9 నెలలుగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నూతన బదిలీ విధానం, కనీస 150 మస్టర్ల సర్కులర్ వెంటనే రద్దు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. జేసీసీ సమావేశాలు వెంటనే నిర్వహించాలన్నారు.


