News March 29, 2025

ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: మంత్రి

image

ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం V. వెంకటాయపాలెం గ్రామంలో బీటీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 10, 2025

‘వనజీవి రామయ్య’ బయోపిక్‌కు భట్టికి ఆహ్వానం

image

పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవానికి రావాలని చిత్ర దర్శకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చరిత్రను సినిమాగా తీయడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.

News November 10, 2025

రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో

image

రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో ఐకేపీ సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో ప్లాంట్ నిర్మాణానికి 4 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్లాంట్ నిర్వహణ మహిళ సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్లాంట్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. 25 ఏళ్లపాటు వారంటీతో కూడిన సోలార్ పలకలు ఏర్పాటు చేయనున్నారు.

News November 10, 2025

పాత కక్షలతో హత్య.. ఇద్దరు నిందితులు అరెస్టు

image

ఎదులాపురం ముత్తగూడెంకు చెందిన బురా శ్రీనివాస్‌ను పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు రూరల్ సీఐ ఎం. రాజు తెలిపారు. బురా డేవిడ్, పేరెల్లి రాజశేఖర్ సుపారీ మాట్లాడుకుని శ్రీనివాస్‌ను కారులో కిడ్నాప్ చేసి, గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ఎన్ఎస్‌పీ కెనాల్‌లో పడేశారని సీఐ వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.