News March 29, 2025

పాడేరు: ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్ 

image

తడికవాగు శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన శబరి ఎల్ఓసీ కమాండర్ మడకం మంగ, పార్టీ మెంబర్ మడివి రమేశ్‌ను అరెస్టు చేశామని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ప్రకటించారు. పోలీసులను హతమార్చేందుకు ఈ ఇద్దరు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్ చేశామన్నారు. మారణాయుధాలతో వీరిద్దరూ పట్టుబడ్డారని చెప్పారు. తుపాకీ, తూటాలు, కత్తులు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News November 28, 2025

రాజమండ్రి: అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

image

అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, సమయపాలన కచ్చితంగా పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శుక్రవారం ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రోజువారీ హాజరుపై ఆరా తీశారు. పేదలకు అందించే భోజనం ఎల్లప్పుడూ నాణ్యతగా ఉండేలా చూస్తూ, మెనూను తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు.

News November 28, 2025

గూడూరు జంక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరిలో గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. జనవరి 27న తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ (17480), 28న పూరి-తిరుపతి (17479), తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ (22708), 29న విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్ (22707) రద్దు కానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

News November 28, 2025

మరిపెడలో అత్యధికం.. చిన్నగూడూరులో అత్యల్పం!

image

మహబూబాబాద్ జిల్లాలో 482 గ్రామపంచాయతీలు, 4110 వార్డు స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు అత్యధికంగా మరిపెడ మండలంలో ఉండగా.. అత్యల్పంగా చిన్నగూడూరు మండలంలో ఉన్నాయి. మరిపెడ(M)లో 48 పంచాయతీలు, 396 వార్డులు ఉన్నాయి. చిన్నగూడూర్(M)లో 11 గ్రామ పంచాయతీలు, 96 వార్డులు ఉన్నాయి.