News March 29, 2025

తిరుపతిలో రూ.2 కోట్ల కోసం కుటుంబం కిడ్నాప్

image

తిరుపతి జీవకోనకు చెందిన రెండు కుటుంబాలను నగదు కోసం కిడ్నాప్ చేసిన సంఘటన శనివారం కలకలం రేపింది. జీవకోనకు చెందిన విజయ్, రమేశ్ కుటుంబ సభ్యులను కొందరు కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. బాధితులు చిత్తూరులో తమ కుటుంబ సభ్యులు ఉన్నారని, అక్కడికి వెళ్తే నగదు ఇస్తామని కిడ్నాపర్లు నమ్మబలికారు. ఐతేపల్లె వద్ద రాజేశ్ కారు నుంచి కిందికి దూకేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 1, 2026

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్.. వార్ జోన్‌లో 80లక్షల మంది భారతీయులు!

image

US, ఇజ్రాయెల్‌ – ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వార్ జోన్‌లో ఉన్న దేశాల్లో దాదాపు 80లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూఏఈలో 35.5లక్షలు, సౌదీ అరేబియాలో 24.6లక్షలు, ఖతార్‌లో 8.4లక్షలు, కువైట్‌లో 9.9 లక్షలు, జోర్డన్‌లో దాదాపు 17వేలు, ఇజ్రాయెల్‌లో 20వేలు, ఇరాన్‌‌లో 10వేల మంది భారతీయులు ఉన్నారు. కాగా భారత విదేశాంగ శాఖ అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

News March 1, 2026

ఈరోజు నమాజ్ వేళలు (01-3-2026) ఆదివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.46 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.51 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 1, 2026

నాగిరెడ్డిపేటలో సినిమా షూటింగ్

image

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గువ్వల చెరువు ఘాట్ అనే సినిమా షూటింగ్ నిర్వహించారు. సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని షూటింగ్‌ను తిలకించారు. సినిమా నిర్వాహక మేనేజర్ శ్యామ్ మాట్లాడుతూ.. వచ్చే నెల 8 వరకు ఇక్కడ షూటింగ్ ఉంటుందన్నారు.