News March 29, 2025
సానియా సోదరి ఎక్స్‌పోలో కాల్పుల కలకలం

TG: HYD గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా ఏర్పాటుచేసిన ఓ ఎక్స్‌పోలో ఇద్దరు షాపు యజమానుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఓ వ్యక్తి తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎక్స్‌పోలో భద్రతను పెంచారు.
Similar News
News April 2, 2025
పార్లమెంట్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ

లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. LOP రాహుల్ గాంధీ ఇప్పుడే పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాగా బిల్లు విషయంలో కేంద్రం తొందరపాటుతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ దుయ్యబట్టారు. సరైన చర్చ లేకుండానే బిల్లు పాస్ చేయాలని చూస్తోందన్నారు. తమకు మాట్లాడేందుకు సరిపడా సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. మరోవైపు కేంద్ర మంత్రి రిజిజు విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు.
News April 2, 2025
అది గుర్తొచ్చినప్పుడల్లా గూస్‌బంప్స్ వస్తాయి: యువీ

వన్డే వరల్డ్ కప్-2011ను టీమ్ఇండియా గెలుపొందడంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘APR 2, 2011. ఆ రాత్రి వంద కోట్ల మంది కోసం పోరాడాం. అలాగే రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌ను తన భుజాలపై మోసిన లెజెండ్ సచిన్‌కు ఈ విజయం అంకితం చేశాం. ఇన్నేళ్లయినా ఆ విజయాన్ని గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నాకు గూస్‌బంప్స్ వస్తాయి. ఆ రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేం’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.
News April 2, 2025
వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే అత్యధికం

దేశంలో వక్ఫ్ ఆస్తులు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నట్లు ఇండియా టుడే పేర్కొంది. 27 శాతం ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయంది. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ బెంగాల్(9%), పంజాబ్(9%), తమిళనాడు(8%), కర్ణాటక(7%), కేరళ(6%), తెలంగాణ(5%), గుజరాత్(5%) ఉన్నాయని వెల్లడించింది. ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతోంది.