News March 29, 2025
KMR: మహిళా సాధికారత దిశగా వరి కొనుగోళ్లు: కలెక్టర్

మహిళా సాధికారత దిశగా కామారెడ్డి జిల్లా అడుగులు వేస్తుందని.. అందులో భాగంగానే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టరేట్‌లో శనివారం గ్రామ అధ్యక్షులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 183 సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 13, 2026
దీపికకు రాష్ట్రపతి ఆహ్వానం

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఆహ్వానం అందింది. అమరాపురం(M) తంబలహట్టిలో దీపికకు ఈ ఆహ్వాన పత్రికను హిందూపురం తపాలా అధికారులు అందజేశారు. రాష్ట్రపతి ఆహ్వానం రావడంతో మండల వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ దీపికను అభినందించారు. ఇది గ్రామానికే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
News January 13, 2026
ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్‌లు!

WPLలో భాగంగా జనవరి 14, 15 తేదీల్లో జరిగే మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 15న ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో DY పాటిల్ స్టేడియంలో జరిగే DC-UPW, MI-UPW మ్యాచ్‌లకు సరిపడా భద్రత కల్పించలేమని పోలీసులు BCCIకి తెలియజేశారు. ఈ తేదీలకు సంబంధించిన టికెట్లను అమ్మకానికి పెట్టలేదు. 16న జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సైతం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.
News January 13, 2026
నేటి నుంచి పరేడ్ గ్రౌండ్స్‌లో పతంగుల పండుగ

TG: Hyd పరేడ్ గ్రౌండ్స్‌లో ఈరోజు నుంచి 18వ తేదీ వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అలాగే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. పతంగులతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయి. భద్రత దృష్ట్యా మాంజా దారాన్ని నిషేధించారు. సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.


