News March 29, 2025

చిత్తూరు జిల్లా ప్రథమ స్థానం: కలెక్టర్ 

image

చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో, ఎన్‌ఇసిసి సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతాంగం వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమపై ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉన్నారన్నారు.

Similar News

News April 2, 2025

చిత్తూరుకు రెండో స్థానం

image

పన్ను వసూళ్లలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని డీపీఓ సుధాకర్ రావు తెలిపారు. గత బకాయిలతో కలిపి మొత్తం వార్షిక లక్ష్యం రూ.24.45 కోట్లు కాగా.. అందులో రూ.21.34 కోట్లు వసూళ్లయ్యాయన్నారు. ఇందులో పన్నుల లక్ష్యం రూ.17.41 కోట్లకు గాను రూ.14.85, పన్నేతర లక్ష్యం రూ.6.84 కోట్లకు గాను రూ.6.49 కోట్లు వచ్చిందన్నారు. మొత్తం లక్ష్యంలో 87 శాతం వసూలైనట్లు ఆయన వెల్లడించారు.

News April 2, 2025

చిత్తూరులో ప్రాణం తీసిన ఫోన్ నంబర్..!

image

ఓ ఫోన్ నంబర్ వివాదం ఒకరి ప్రాణం తీసింది. చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున వివరాల మేరకు.. ఏనుగుంట్లపల్లి హరిజనవాడకు చెందిన ఉమకు 14 ఏళ్ల కిందట వివాహం జరగ్గా.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె ఫోన్ నంబర్ పక్కింట్లో ఉండే శివశంకర్ ఫోన్‌లో ఉంది. దీనిని గమనించిన అతని భార్య సుజాత.. ఉమతో పాటు భర్తను నిలదీసింది. దీంతో మనస్థాపం చెంది ఉమ ఇంట్లోనే ఉరేసుకుంది.

News April 1, 2025

చిత్తూరు: టెన్త్ పరీక్షలకు 191 మంది గైర్హాజరు

image

చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. మొత్తం 118 పరీక్షా కేంద్రాల్లో 20,893 మంది విద్యార్థులకు గాను 20,702 మంది పరీక్షలు రాశారని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 31 పరీక్ష కేంద్రాలను చెక్ చేసిందన్నారు. 57 మంది సిట్టింగ్ స్క్వాడ్లు విధులు నిర్వహించారన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని స్పష్టం చేశారు.

error: Content is protected !!