News March 25, 2024

వైసీపీకి షాక్?

image

AP:ప్రకాశం జిల్లాలో YCPకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. వైశ్య సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు TDPలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దర్శి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన.. ఈ నెల 27న TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న ఆయనకు దర్శి టికెట్ ఇచ్చేందుకు TDP హైకమాండ్ సానుకూలంగా ఉందట. అటు YCP టికెట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దక్కింది.

Similar News

News April 10, 2026

యూత్‌లో గుండె జబ్బులు.. భారంగా మారుతున్న ఇన్సూరెన్స్!

image

గతంలో 50 ఏళ్లు దాటాక వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20 ఏళ్లకే వస్తున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ ఎక్కువని భావించి ప్రీమియం ధరలను 50% వరకు పెంచే యోచనలో ఉన్నట్లు ప్లమ్ సంస్థ డేటా వెల్లడించింది. అంటే గతంలో కంటే ఇప్పుడు పాలసీ కోసం ఎక్కువ డబ్బులు కట్టాలి. అందుకే సరైన టైమ్‌లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఆస్పత్రి ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వస్తుందంటున్నారు.

News April 10, 2026

‘భోగాపురం’ ప్రారంభానికి రండి.. మోదీకి CBN ఆహ్వానం

image

AP: జులై/ఆగస్టులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకకు రావాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. జులై 5 లేదా 8న, ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో సమయం ఇవ్వాలని కోరారు. జూన్ 30 లోగా పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.

News April 10, 2026

మే 1 నుంచి థియేటర్లు బంద్?

image

తెలంగాణ(నైజాం)లో మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసేసే యోచనలో ఎగ్జిబిటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పర్సెంటేజీ విధానాన్ని నిర్మాతలు తిరస్కరించడంతో ఇలా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆదాయాన్ని అలా పంపిణీ చేస్తేనే మూవీస్ ప్రదర్శిస్తామని, ఈనెల 30 లోగా నిర్ణయం తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసిందని టాక్. రెంటల్ స్థానంలో <<19548702>>పర్సెంటేజీ విధానం<<>> అమలు చేయాలని 23 థియేటర్ల యాజమాన్యాలు ఇటీవల నిర్ణయించాయి.