News March 29, 2025
సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 31న రంజాన్ పండుగ సందర్భంగా పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు, అధికారులందరూ గమనించాలని ఆయన కోరారు.
Similar News
News April 2, 2025
వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే అత్యధికం

దేశంలో వక్ఫ్ ఆస్తులు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నట్లు ఇండియా టుడే పేర్కొంది. 27 శాతం ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయంది. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ బెంగాల్(9%), పంజాబ్(9%), తమిళనాడు(8%), కర్ణాటక(7%), కేరళ(6%), తెలంగాణ(5%), గుజరాత్(5%) ఉన్నాయని వెల్లడించింది. ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతోంది.
News April 2, 2025
సంగారెడ్డి: ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని 122 పరీక్ష కేంద్రాల్లో మార్చి 21 నుంచి నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో 22,412 మంది విద్యార్థులకు గానూ 22,371 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని పేర్కొన్నారు.
News April 2, 2025
జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏప్రిల్ 1 నుంచి 30 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఈ సమయంలో పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే విధంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు.