News March 29, 2025
ధోనీ బ్యాటింగ్‌కు ఎందుకు లేటుగా వస్తున్నారు?: వాట్సన్

CSK మాజీ కెప్టెన్ ధోనీ లోయర్ ఆర్డర్‌లో ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆ జట్టు మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ అన్నారు. ఆ జట్టు వ్యూహం ఏంటో తెలియట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే రుతురాజ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుండేదని చెప్పారు. అశ్విన్ కంటే ముందే మహీని పంపించాలని సూచించారు. నిన్న 9వ స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చే సరికే CSK చేతుల్లోంచి మ్యాచ్ చేజారిందని తెలిపారు.
Similar News
News April 2, 2025
వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే అత్యధికం

దేశంలో వక్ఫ్ ఆస్తులు అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నట్లు ఇండియా టుడే పేర్కొంది. 27 శాతం ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయంది. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ బెంగాల్(9%), పంజాబ్(9%), తమిళనాడు(8%), కర్ణాటక(7%), కేరళ(6%), తెలంగాణ(5%), గుజరాత్(5%) ఉన్నాయని వెల్లడించింది. ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతోంది.
News April 2, 2025
IPLలో ప్లేయర్ మ్యాచ్ ఫీజ్ ఎంతంటే?

LSG బౌలర్ <<15965200>>దిగ్వేశ్<<>> సెలబ్రేషన్‌ను తీవ్రంగా పరిగణించిన BCCI మ్యాచ్ ఫీజులో 25% కోత విధించింది. కాగా, IPLలో ఓ మ్యాచ్ ఆడితే BCCI ప్లేయర్(ఇంపాక్ట్ ప్లేయర్)కు రూ.7.5లక్షలు చెల్లిస్తుంది. లీగ్ స్టేజ్‌లో మొత్తం 14మ్యాచులు ఆడితే రూ.1.05cr దక్కుతాయి. ఇది ఫ్రాంచైజీ ప్లేయర్‌కు చెల్లించే వేలం ధరకు అదనం. ఇందుకోసం ప్రతి జట్టు BCCIకి రూ.12.60cr చెల్లిస్తుంది. ఈ లెక్కన దిగ్వేశ్ రూ.1,87,500 నష్టపోనున్నారు.
News April 2, 2025
యూపీఏ హయాంలోనూ సవరణలు జరిగాయి: రిజిజు

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. అందులో ప్రతిపాదించిన సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. చట్టంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించొద్దన్నారు. యూపీఏ హయాంలోనూ ఈ చట్టంలో సవరణలు జరిగాయన్నారు. అది మిగతా చట్టాలపై ప్రభావం చూపిందని, అందుకే మళ్లీ సవరించాల్సి వస్తోందన్నారు.