News March 29, 2025
తిరుపతి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

తిరుపతి జిల్లా పరిధిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఆదివారం, సోమవారం సెలవు దినాలైన పనిచేస్తాయని జిల్లా రిజిస్టర్ శ్రీరామ కుమార్ తెలిపారు. జిల్లాలోని 16 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు యధావిధిగా పనిచేస్తాయని చెప్పారు. వచ్చే నెల రెండు నుంచి తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు నిర్ణీత సమయంలో రావాల్సి ఉంటుందన్నారు
Similar News
News November 7, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,22,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 7, 2025
సూర్య బ్యాడ్ ఫామ్.. 18 ఇన్నింగ్సుల్లో నో ఫిఫ్టీ!

IND టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు గత 18 టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. 7 సార్లు(+3 డకౌట్లు) సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యారు. అత్యధిక స్కోర్ 47*. కెప్టెన్సీ భారం వల్లే సూర్య ఫెయిల్ అవుతున్నారా? లేదా బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పుల వల్ల విఫలం అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. వచ్చే ఏడాది T20WC నేపథ్యంలో సూర్య ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
News November 7, 2025
GOOD NEWS: బీటెక్ చేస్తే GHMCలో ఉద్యోగాలు

GHMC, అర్బన్ లోకల్ బాడీస్‌లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సైట్ ఇంజినీరు, జూనియర్ ప్లానింగ్ పర్సనల్ పోస్టులకు దరఖాస్తులను NAC ఆహ్వానిస్తోంది. సైట్ ఇంజినీర్ 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. B.E/B.Tech/AMIE(సివిల్ ఇంజినీరింగ్) చేసిన వారు అర్హులు. 15 జూ.ప్లానింగ్ పోస్టులకు B.Arch/ B. Plan/ MURP/M (ప్లానింగ్) చేసి ఉండాలి. దరఖాస్తులకు NOV 8 చివరి తేదీ. వివరాలకు www.nac.edu.inను సంప్రదించండి.
SHARE IT


