News March 29, 2025
విశాఖ: టీడీపీ జిల్లా కార్యాలయంలో వేడుకలు

విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా నిర్విరామంగా ప్రజల కష్టాలను తీరుస్తూ, దేశ రాజకీయ చరిత్రలోనే టీడీపీ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే లు గంటా శ్రీనివాస్‌రావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గండి బాబ్జి ఉన్నారు.
Similar News
News April 2, 2025
ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలి: కలెక్టర్

పీఎం ఆవాస్ యోజన – ఎన్టీఆర్ కాలనీల గృహనిర్మాణ పథకంలో భాగంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులకు బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగు హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు అందించి, నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
News April 2, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి బి.పెంటయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. స్టీల్ ప్లాంట్ SMS-2 విభాగంలో గతనెల 14న మంటలు చెలరేగడంతో ఉద్యోగి బి.పెంటయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీంతో స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News April 2, 2025
పెదగంట్యాడలో అమ్మాయి ఆత్మహత్య

పెదగంట్యాడ మండలానికి చెందిన 21 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. విశాఖలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో డిప్లమో ఫైనల్ ఇయర్ చదువుతున్న పైలా దివ్య పెదగంట్యడలోని నేతాజీ నగర్‌లో ఉంటోంది. సోమవారం తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు మంగళవారం తెలిపారు.