News March 29, 2025
NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News March 2, 2026
డిచ్‌పల్లి: చెరువులో పడి వ్యక్తి మృతి

డిచ్‌పల్లి మండలం దూస్ గాన్ చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందల్వాయి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ విక్రమ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కి చెందిన జగన్నాథం శనివారం దూస్‌గాన్ గ్రామానికి పని నిమిత్తం వచ్చాడు. ఊరు చివరన గల కొత్త చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టి మృత దేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 2, 2026
NZB: వాలీబాల్ తగిలి ఇరువర్గాల మధ్య ఘర్షణ

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 27న తండాకు చెందిన కొందరు యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్‌ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధురాలికి తగిలింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
News March 1, 2026
నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.


