News March 29, 2025

 సంగారెడ్డి సెంట్రల్ జైలును సందర్శించిన జిల్లా జడ్జి

image

కందిలోని సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలును జిల్లా జడ్జి భవాని చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని వంటగది స్టోర్ రూం పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఎవరికైనా న్యాయ సాయం కావాలంటే ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఆమె వెంట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్, జైలు సిబ్బంది ఉన్నారు.

Similar News

News April 2, 2025

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళి

image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

News April 2, 2025

వెలగపూడిలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం సమీక్ష

image

తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆలయ భద్రత, దర్శన వ్యవస్థలో మార్పులు, భక్తుల వసతి ఏర్పాట్లు వంటి అంశాలపై సీఎం చర్చించారు.

News April 2, 2025

ముంబైని వదిలి గోవాకు?

image

ముంబై యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. వ్యక్తిగత కారణాలతో వచ్చే సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్లో ముంబైని వదిలి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు NOC కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు ఈమెయిల్ చేసినట్లు తెలుస్తోంది. జైస్వాల్ గోవా జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

error: Content is protected !!