News March 29, 2025

రోడ్లు వేయండి.. నిధుల కోసం వెనకాడొద్దు: సీఎం

image

TG: HRDCL రోడ్డు నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరంలో నిర్మించాల్సిన రహదారులు, వాటి విస్తరణలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అవసరమైతే అదనపు స్థల సేకరణ జరపాలని, నిధులకోసం వెనకాడవద్దని స్పష్టం చేశారు.

Similar News

News April 2, 2025

ముంబైని వదిలి గోవాకు?

image

ముంబై యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. వ్యక్తిగత కారణాలతో వచ్చే సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్లో ముంబైని వదిలి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు NOC కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు ఈమెయిల్ చేసినట్లు తెలుస్తోంది. జైస్వాల్ గోవా జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

News April 2, 2025

బీసీల డిమాండ్‌ను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు: సీఎం

image

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. బీసీల లెక్క తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని కోర్టులు చెప్పాయని, అందుకే బీసీ కులగణన చేపట్టామని చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయబద్ధమైనదని, దీన్ని బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.

News April 2, 2025

ALERT: ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా?

image

మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వెకేషన్‌కు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి మద్రాస్ హైకోర్టు ఈ-పాస్‌ తప్పనిసరి చేసింది. టూరిస్టుల భద్రత, పర్యావరణ పరిరక్షణ, రద్దీ తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-పాస్ ఉంటేనే నీలగిరి, దిండిగల్ జిల్లాల్లోకి పోలీసులు వాహనాలను అనుమతిస్తారు. ఈ-పాస్ కోసం https://epass.tnega.org/ సైట్‌లో అప్లై చేసుకోవాలి.

error: Content is protected !!