News March 29, 2025
‘పది’ జవాబు పత్రాలు సురక్షితంగా ఉన్నాయి: ఖమ్మం DEO

కారేపల్లి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో నిర్వహించిన SSC మార్చి-2025కు సంబంధిన భౌతిక, రసాయన శాస్త్రం జవాబు పత్రాలను తపాలా శాఖ వారు తరలిస్తుండగా జారి కింద పడడం జరిగింది. కాగా ఆ పరీక్ష జవాబు పత్రాలు సురక్షితంగానే ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ వర్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
Similar News
News April 2, 2025
ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి: మంత్రి తుమ్మల

ఆయిల్ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.21,000కు చేరిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ధర రూ. 8,500 మేర పెరిగిందని మంత్రి తెలిపారు. ధర పెరగడంతో రాష్ట్రంలోని 64,582 మంది ఆయిల్ పాం రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని, ఇంకా మరింతమంది రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు.
News April 2, 2025
ఖమ్మంలో కేజీ పచ్చిమిర్చి @రూ.24

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్(VDO’Sకాలనీ)లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ.20, వంకాయ 24, బెండకాయ 20, పచ్చిమిర్చి 24, కాకర 38, కంచకాకర 46, బీరకాయ 48, సొరకాయ 16, దొండకాయ 38, క్యాబేజీ 20, చిక్కుడు 80, ఆలుగడ్డ 30, చామగడ్డ 40, క్యారెట్ 38, బీట్రూట్ 26, బీన్స్ 50, క్యాప్సికం 54, ఉల్లిగడ్డలు 34, కోడిగుడ్లు(12) రూ.60గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.
News April 2, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} కామేపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన
∆} బోనకల్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయం