News March 29, 2025
రుద్రవరంలో మరోసారి భానుడి విశ్వరూపం.!

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం శనివారం నంద్యాల(D) రుద్రవరంలో రాష్ట్రంలోనే 43.5°C, కర్నూలు(D) ఉలిందకొండలో 42.4°C ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, గత కొద్దిరోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
Similar News
News April 2, 2025
నారాయణపేట: ‘పాపన్న గౌడ్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి’

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగుబలహీన వర్గాలకు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
News April 2, 2025
ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్లపై దాడి

AP: విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్‌లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. దీపిక అనే యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి(43) మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన యువకుడిని నవీన్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
News April 2, 2025
శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని ఎస్పీకి ఆహ్వానం

నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో ఈ నెల 6న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని జిల్లా ఎస్పీ నర్సింహాను ఆలయ ధర్మకర్త కొల్లు క్షత్రయ, నడిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులుఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆలయ ధర్మ కర్త మాట్లాడుతూ.. శ్రీరామ నవమి ఆహ్వానంపై ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.