News March 25, 2024
మైత్రీ చేతిలో బడా సినిమాలు

మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది. ఈ నిర్మాణ సంస్థ చేతిలో బడా హీరోల చిత్రాలు లాక్ అయ్యాయి. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రీకరణ కొనసాగుతోండగా.. చెర్రీ-సుకుమార్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, ప్రభాస్-హను రాఘవపూడి, గుడ్ బ్యాడ్ అగ్లీ(అజిత్), రాబిన్ హుడ్(నితిన్), విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యాయన్ మూవీలతో పాటు పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
Similar News
News March 11, 2026
BREAKING: IPL తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్-2026 తొలి దశ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచుల తేదీలు, వేదికలను ఐపీఎల్ ప్రకటించింది. షెడ్యూల్ కోసం పైన ఇమేజ్‌లు చూడండి. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచులు ఆడనుంది. మూడు రాష్ట్రాల ఎన్నికల డేట్లు ప్రకటించిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను వెలువరిస్తామని BCCI తెలిపింది.
News March 11, 2026
BREAKING: IPL తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

క్రికెట్ అభిమానులకు శుభవార్త. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రా.7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ తలపడనున్నట్లు IPL ట్వీట్ చేసింది. మరికాసేపట్లో తొలి దశ షెడ్యూల్ రానుంది.
News March 11, 2026
అంతరిక్షంలో అంతా నిశ్శబ్దమే

అంతరిక్షం ఒక నిశ్శబ్ద సామ్రాజ్యం. భూమిపై గాలి ఉండటం వల్ల శబ్ద తరంగాలు ప్రయాణిస్తాయి. కానీ అంతరిక్షంలో గాలి, నీరు వంటి మాధ్యమాలు లేకపోవడంతో అక్కడ పెద్ద పేలుడు జరిగినా అది మనకు అస్సలు వినిపించదు. అక్కడ భారీ గ్రహశకలాలు ఢీకొన్నా, నక్షత్రాలు పేలిపోయినా ఎటువంటి శబ్దమూ రాదు. వ్యోమగాములు పక్కపక్కనే ఉన్నా రేడియో తరంగాలు లేకుండా మాట్లాడుకోలేరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..


