News March 29, 2025

రోడ్ల మరమ్మతులకు రూ.600 కోట్లు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. ప్రాధాన్యతా క్రమంలో రాష్ట్ర, జిల్లా రోడ్లకు సంబంధించి 225 పనులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News January 10, 2026

OTTలోకి ‘దండోరా’.. డేట్ ఫిక్స్

image

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన <<18646239>>కామెంట్స్<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

News January 10, 2026

రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

image

<>AP <<>>హెల్త్ , మెడికల్& ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లో 97అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి APMSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 12 నుంచి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగంలో పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/

News January 10, 2026

MSVG టికెట్ ధరల పెంపు.. రెండు రోజుల కిందటే అనుమతి?

image

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల <<18817046>>పెంపునకు<<>> TG ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఈ నెల 8వ తేదీ ఉండటంతో 2 రోజుల కిందటే టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా జీవో బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ ఎల్లుండి థియేటర్లలోకి రానుండగా, రేపు ప్రీమియర్లు వేయనున్నారు.