News March 29, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*జంగారెడ్డిగూడెంలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి. *అగిరిపల్లి మండలంలో 50 లక్షల తో నిర్మించే సీసీ రోడ్లకు మంత్రి పార్థసారథి శంకుస్థాపన.*జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు నివ్వాలి :కలెక్టర్.*జిల్లావ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. *విశ్వకర్మ కార్పొరేషన్ రుణాలను మంజూరు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించిన మంత్రి. *జంగారెడ్డిగూడెంలో మంత్రి కందుల దుర్గేశ్ పర్యటన.
Similar News
News January 11, 2026
చైనా, అమెరికాకు సాధ్యం కానిది ఇండియా సాధించింది: చంద్రబాబు

AP: బెంగళూరు-కడప-విజయవాడ కొత్త నేషనల్ హైవే వారం రోజుల వ్యవధిలోనే 4 గిన్నిస్ రికార్డులను సాధించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీటుతో 156 లేన్ కి.మీ రహదారి నిర్మించారని కాంట్రాక్ట్ కంపెనీ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకన్ లిమిటెడ్, NHAIను అభినందించారు. కొత్త రోడ్ల నిర్మాణంలో అమెరికా, చైనా, జర్మనీకి సాధ్యం కానిది.. భారత్ సుసాధ్యం చేసిందని ట్వీట్ చేశారు.
News January 11, 2026
ఆది దంపతులకు పల్లకి ఉత్సవం

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆదివారం రాత్రి పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని చేపట్టారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. మహాగణపతి పూజ అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఉంచి, శాస్త్రోక్తంగా పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు.
News January 11, 2026
విశాఖ- పార్వతీపురం మధ్య ప్రత్యేక MEMU రైలు

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ-పార్వతీపురం మధ్య MEMU స్పెషల్ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (08565/08566) రైలు ఈనెల 14-18 వరకు విశాఖలో ఉ.10కి బయలుదేరి మ.12.20కి పార్వతీపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పార్వతీపురంలో మ.12.45కి బయలుదేరి సా.4 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలుకి సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, తదితర స్టేషన్లలో హాల్ట్ కలదు.


