News March 30, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@పదవి విరమణ పొందిన ఎస్సై, హెడ్ కాన్స్టేబుల్.. సత్కారించిన అదనపు ఎస్పీ @జిల్లాలో 7 పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ @JGL-KNR కొండగట్టు వద్ద ప్రమాదం.. ఒకరి మృతి @మొగిలిపేట -నడికుడ గ్రామ సరిహద్దుల మధ్య గొడవ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు @దూలరులో సివిల్ రైట్స్ డే కార్యక్రమం
Similar News
News April 2, 2025
NZB: పిల్లలతో తండ్రి సూసైడ్ అటెంప్ట్

బాసర గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకడానికి ప్రయత్నించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులతో పాటు తండ్రిని బాసర పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాలతో NZB బోయగల్లికి చెందిన గంగాప్రసాద్‌తో పాటు ఇద్దరు చిన్నారులను కానిస్టేబుల్ మోహన్‌సింగ్ కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీలకు అప్పగిస్తామని తెలిపారు. కానిస్టేబుల్‌ను బాసర ఎస్ఐ గణేశ్ అభినందించారు.
News April 2, 2025
కడప: వైవీయూ దూర విద్యా పీజీ ఫలితాలు విడుదల

వైవీయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యు కేషన్ పీజీ 1, 2 సెమిస్టర్ల ఫలితాలను సీడీవోఈ డైరెక్టర్ ప్రొ. కె. కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డా. ఎం. శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ,, 1, 2వ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 08 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించామన్నారు. ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను అభినందించారు.
News April 2, 2025
మాజీ సీఎం లాలూకు అస్వస్థత

బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీకి వెళ్లేందుకు పట్నా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. 4.05pmకు ఎయిర్ ఇండియా విమానం ఎక్కాల్సిన ఆర్జేడీ చీఫ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కాగా, ఎయిర్ అంబులెన్సులో లాలూను ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లనున్నారు.