News March 30, 2025

ఆసుపత్రిని తర్వగా నిర్మించాలి: MNCL కలెక్టర్

image

మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం పరిశీలించారు. జిల్లాలోని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం నూతన ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నూతన భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

Similar News

News September 17, 2025

తాడేపల్లి: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

image

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు సీఎంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News September 17, 2025

భువనగిరి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై న్యూ డైమెన్షన్ స్కూల్ సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. లూనాపై వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అనాజిపురానికి చెందిన బాలయ్య గౌడ్‌గా గుర్తించారు. అతను భువనగిరి వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంతో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడు కల్లుగీత కార్మికుడు. న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News September 17, 2025

HYD: 5 ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు

image

నాగార్జునసాగర్ రింగ్ రోడ్డు- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రాకపోకలు సాగించేవారికి సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం మరో 5 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, RUBల నిర్మాణాలకు GHMC సిద్ధమవుతోంది. TKR కమాన్, ఒమర్ హోటల్, బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. త్వరలోనే ఫీజిబిలిటీ స్టడీ, DPRలు పూర్తిచేసి పనులు చేపట్టనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు.