News March 30, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శనివారం 1,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.55,000లు, ప్రసాద విక్రయాలు ద్వారా రూ.7,32,080లు VIP దర్శనాల ద్వారా రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.1,19,100, కార్ పార్కింగ్ రూ.1,90,000, సువర్ణ పుష్పార్చన రూ.55,600, ప్రధాన బుకింగ్ రూ.90,450, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.20,42,139ల ఆదాయం వచ్చింది.

Similar News

News September 19, 2025

కరేడులో భూములు లాక్కోవడం లేదు: అనగాని

image

AP: నెల్లూరు(D) ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ కంపెనీ కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నష్టపరిహారం ఎకరాకు రూ.20 లక్షలుగా నిర్ణయించడంతో రైతులే సమ్మతించి భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోగా, 300 ఎకరాలకు నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు. మండలిలో YCP MLC మాధవరావు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు.

News September 19, 2025

మ‌న జీవితం బాధ్యత మ‌న‌దే: సాయి దుర్గ తేజ్‌

image

TG: హెల్మెట్ ధరించడం వల్లే తాను ప్రాణాలతో బయటపడినట్లు హీరో సాయి దుర్గ తేజ్ పేర్కొన్నారు. HYD పోలీసులు నిర్వహించిన ‘ట్రాఫిక్ స‌మ్మిట్ 2025’కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ‘హెల్మెట్ ధ‌రించ‌ని వాళ్ల‌కి, తాగి బండి న‌డిపేవాళ్ల‌కి చిన్న ప‌నిష్మెంట్ ఇస్తే వారికి జీవితాల‌పై మ‌రింత బాధ్య‌త పెరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్ మాత్ర‌మే’ అని తెలిపారు. ఆయ‌న‌ పోలీస్ శాఖ‌కు రూ.5 ల‌క్ష‌లు విరాళాన్ని ఇచ్చారు.

News September 19, 2025

సెప్టెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

✒ 1887: రచయిత, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం
✒ 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
✒ 1924: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
✒ 1960: భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం(ఫొటోలో)
✒ 1977: క్రికెటర్ ఆకాశ్ చోప్రా జననం
✒ 1965: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం