News March 30, 2025
ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు: ASF కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో రహదారి భద్రత కమిటీ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన రహదారుల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News January 3, 2026
రూ.500 నోట్ల నిలిపివేత?.. నిజమిదే!

దేశంలో మార్చి నుంచి రూ.500 నోట్లు రద్దు కానున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఆ నోట్ల చెలామణీ నిలిచిపోతుందన్న వార్తలన్నీ ఫేక్ అని స్పష్టం చేసింది. రూ.500 నోట్ల రద్దుపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మి గందరగోళానికి గురి కావద్దని సూచించింది. కాగా గత జూన్‌లోనూ ఇలాంటి <<16594040>>ప్రచారమే<<>> జరిగింది.
News January 3, 2026
జాతీయ ఆర్చరీలో కర్నూలుకు స్వర్ణ కాంతులు

హైదరాబాద్‌లో జరిగిన 5వ జాతీయ స్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కర్నూలు క్రీడాకారులు సత్తా చాటారు. ఏపీ జట్టు తరఫున పాల్గొన్న 30 మంది క్రీడాకారులు 7 బంగారు, 6 వెండి, 10 కాంస్య పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించడం గొప్ప విషయమని, అందులో కర్నూలు క్రీడాకారులు ఉండటం గర్వకారణమని డీఐజీ/కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. క్రీడాకారులను ఆయన అభినందించారు.
News January 3, 2026
నవగ్రహాలను దర్శించుకొని కాళ్లు కడగకూడదా?

అలా కడగకూడదని పండితులు చెబుతుంటారు. అలా కడిగితే గ్రహాల శక్తి తరంగాలు మనపై చూపించే సానుకూల ప్రభావం, పుణ్యఫలం తగ్గిపోతుందని అంటారు. అయితే ఆలయం నుంచి ఇంటికి వెళ్లి, కొద్ది సమయం తర్వాత కడుక్కోవచ్చట. నవగ్రహాల ప్రదక్షిణలు ముగించి, కాసేపు అక్కడ కూర్చుని, ఆ గ్రహాల అనుగ్రహాన్ని స్మరించుకుని బయటకు రావాలట. ప్రదక్షిణ చేసిన వెంటనే కాళ్లు కడగడం వల్ల దోష నివారణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని భక్తుల నమ్మకం.


