News March 30, 2025
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి: కలెక్టర్

జిల్లాలో బైక్ రైడర్లు తప్పకుండా హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను శనివారం ఆదేశించారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో బైక్ రైడర్లు హెల్మెట్ వినియోగించకపోవడం ఆందోళన కరమన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Similar News
News March 1, 2026
ఈ నెల 4న ‘విరోష్’ రిసెప్షన్.. వారికే అనుమతి!

విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ ఈ నెల 4న HYDలో జరగనుంది. వాలిడ్ ఇన్విటేషన్ ఉన్నవారినే అనుమతించనున్నట్లు ‘విరోష్’ జోడి ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. ‘భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల సూచనతో గెస్ట్ లిస్ట్‌ను కుదించాం. దయచేసి ఇన్విటేషన్ లేని వారు ఈవెంట్ ప్లేస్‌కి రావొద్దు. ఎలాంటి అంతరాయం లేకుండా రిసెప్షన్ జరిగేందుకు సహకరించండి’ అని కోరింది. కాగా ఈరోజు CM రేవంత్‌ను రష్మిక రిసెప్షన్‌కు ఆహ్వానించారు.
News March 1, 2026
తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుంది: DGP

తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల నియంత్రణలోనూ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ ముందు వరుసలో ఉన్నామని DGP శివధర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. మహిళలు, సైబర్ నేరాల, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలపై విస్తృత సమీక్ష చేపట్టారు.
News March 1, 2026
నివారణాత్మక పోలీసింగ్‌పై దృష్టి: తెలంగాణ డీజీపీ

నివారణాత్మక పోలీసింగ్‌పై దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్మించిన పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అదే విధంగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి డీజీపీ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్.. పోలీస్ సిబ్బంది, పోలీస్ పిల్లలను ఉత్తమ క్రీడాకారులను చేయడమే లక్ష్యంగా నిర్మితమైతుందన్నారు.


