News March 30, 2025
ప్రజలందరికీ జీవితాల్లో ఉగాది వెలుగులు నింపాలి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రజలందరి జీవితాల్లో ఉగాది వెలుగులు నింపాలని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
Similar News
News January 20, 2026
రాష్ట్రంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరితేదీ

TGSRTCలో 198 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేస్తోంది. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్ట్ చేస్తారు.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు www.tgprb.inలో అందుబాటులో ఉంటాయి.
News January 20, 2026
మదనపల్లె: కర్నూలులోనూ ఏసీబీ దాడులు

మదనపల్లె DEO ఆఫీసుపై ACB అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. గుర్రంకొండలోని ఏబీసీ స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రినాయుడు వద్ద సోమవారం రూ.45 వేలు లంచం తీసుకుంటుండగా కడపకు చెందిన ACB డీఎస్పీ సీతారామారావు, CIనాగరాజ దాడులు చేశారు. సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా(మున్నా), ఏడీ రాజశేఖర్‌ను అరెస్టు చేశారు. కర్నూలులోని ఏడీ రాజశేఖర్ సొంత ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
News January 20, 2026
రేపటి నుంచి JEE మెయిన్స్

TG: JEE మెయిన్స్ సెషన్-1 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉ.9 గం.-మ.12 వరకు, మ.3గం.-సా.6 వరకు 2 సెషన్స్ ఉంటాయి. HYD, SEC, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ సహా రాష్ట్రంలో 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 40వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


