News March 30, 2025

‘సిద్దిపేట జిల్లాలో డ్రగ్స్‌ను అంతం చేయాలి’ 

image

శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) అబ్దుల్ హమీద్ నిర్వహించారు. జిల్లాలో డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని అంతం చేయాలన్నారు. ముఖ్యంగా ఏక్కడి నుంచి రవాణా అవుతుందో నిఘా పెట్టాలని, సోషల్ మీడియాలో డ్రగ్స్ అవేర్నెస్ వీడియోలు, పోటోలతో ప్రచారం చేయాలన్నారు.

Similar News

News March 1, 2026

ఇరాన్‌లోని లక్ష్యాలపై క్లాడ్ AI సాయంతో US దాడి

image

ఇరాన్‌పై దాడిలో ఆంథ్రోపిక్ క్లాడ్ AI సాంకేతికను US వినియోగించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. శత్రువులపై నిఘా, యుద్ధంలో లక్ష్యాలను గుర్తించడానికి క్లాడ్‌ను వాడిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు వివరించింది. యుద్ధంలో తమ AIని వాడేందుకు ఆంథ్రోపిక్ నిరాకరించడంతో ట్రంప్ దాని కాంట్రాక్టును ఇటీవల రద్దుచేయడం తెలిసిందే. అయితే US రక్షణ వ్యవస్థలో అప్పటికే ఆ AI ఇంటిగ్రేట్ అయి ఉండడంతో వినియోగించారంది.

News March 1, 2026

మండపేట: క్షణికావేశంలో హత్య.. కటకటాలపాలైన అన్నదమ్ములు

image

మండపేట మండలం ద్వారపూడిలో గురువారం రాత్రి జరిగిన హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులైన అన్నదమ్ములు అయినవిల్లి చంద్రపాల్, గిరిబాబు పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావును రాళ్లతో కొట్టి అతి దారుణంగా చంపారు. ఆవేశంలో చేసిన ఈ దాడితో సూర్య ప్రకాశరావు మృతి చెందగా, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 1, 2026

కనువిందుగా భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.