News March 30, 2025

రాజమండ్రి: రహదారుల అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ

image

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు రూ.25 కోట్లతో అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు నిర్మించడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఆయా గ్రామాల్లో అత్యవసరమైన పనుల ప్రతిపాదనల జాబితాను శనివారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి అందజేశారు. పంచాయతీరాజ్ పరిధిలో గల గ్రామీణ రోడ్లలో అధ్వానంగా ఉన్న వాటిని అభివృద్ధి చేయడానికి సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News November 4, 2025

ఓటర్ల సౌకర్యార్థం “Book a Call with BLO” సదుపాయం

image

ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ‘Book a Call with BLO’ నూతన సదుపాయాన్ని జిల్లాలో ఓటర్లు వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వారు NGSP స్టేట్ నోడల్ ఆఫీసర్లతో అక్టోబర్ 24న నిర్వహించిన సమావేశంలో ఓటర్ అనుభవాన్ని మెరుగుపరచడం, ఫెసిలిటేషన్ చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ మాడ్యూల్‌ను అమలులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

News November 4, 2025

ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: డీఈవో

image

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలకు (మార్చి 2026) ఫీజు చెల్లింపు గడువును ఈనెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ వాసుదేవరావు మంగళవారం తెలిపారు. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి వారి ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి ఫెయిల్ అయినవారు, రెగ్యులర్ పరీక్ష అర్హత కోల్పోయినవారికి ఇది మంచి అవకాశం అని ఆయన వెల్లడించారు.

News November 3, 2025

శివాలయాలు, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు పెంపు: ఎస్పీ

image

కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నర్సింగ్ కిషోర్ సోమవారం తెలిపారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని, భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలలో భద్రత దృష్ట్యా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.