News March 30, 2025
ముక్తేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు పంచాంగ శ్రవణం కార్యక్రమం జరగనున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధికారి మహేశ్ తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.
Similar News
News July 6, 2025
పర్యాటకులకు స్వర్గధామంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం: లక్ష్మీశా

ఎన్టీఆర్ జిల్లాను పర్యాటకులకు స్వర్గధామంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆదివారం ఆయన విజయవాడ భవానీ ఐలాండ్‌ను పరిశీలించారు. సెల్ఫీ పాయింట్లు, మేజ్ గార్డెన్, బోటింగ్ పాయింట్‌లను ఆయన పరిశీలించారు. ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యేలతో కలిసి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఈ రంగంలో స్థూల విలువ (జీవీఏ) పెంచేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
News July 6, 2025
భవాని దేశానికే గర్వకారణం: హోం మంత్రి అనిత

కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పథకాలు సాధించిన విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవానీని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఈమె దేశానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.
News July 6, 2025
జిందాల్ భూముల వ్యవహారంపై స్పందించిన మంత్రి

జిందాల్ భూముల వ్యవహారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ‘ఎక్స్’ వేదికగా ఆదివారం స్పందించారు. జిందాల్ భూముల్లో MSME పార్కుల అభివృద్ధి ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని, ఆ పార్కుల్లో ఏ పరిశ్రమలు వస్తాయనేది ఇంకా స్పష్టత లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేస్తేనే నీరు సరఫరాపై ఆలోచించాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్వాసిత రైతులకు ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలుంటే వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందన్నారు.