News March 30, 2025
నేడు ఆదిలాబాద్‌కు గ్రేట్ ఖలీ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం WWE సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ రానున్నట్లు ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రయాణం ముగించుకొని ఆయన సొంత ఊరికి వెళ్తున్న ఖలీ మార్గమధ్యలో ఆదిలాబాద్‌లోని తన ఇంటికి రానున్నట్లు ఆదిత్య వెల్లడించారు. ఆదివారం ఇక్కడే ఉండి మరుసటి రోజు తిరుగి ప్రయాణం కానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 2, 2025
ADB: వేధింపులా.. 8712659953కి కాల్ చేయండి: SP

మహిళలు, విద్యార్థినులకు ఉద్యోగస్థలాల్లో, కళాశాలల్లో ఎలాంటి సమస్యలున్నా, వేధింపులకు గురైనా జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. షీ టీం బృందాలను సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ 8712659953ను ఏర్పాటుచేశామన్నారు. జిల్లాలో గత నెలల్లో 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటిలో 3 కేసులు, మావల పీఎస్‌లో ఒక FIR నమోదు చేసినట్లు చెప్పారు.
News April 2, 2025
ఉట్నూర్: అస్వస్థతతో ఉపాధి కూలీ మృతి

అస్వస్థతకు గురై ఉపాధి కూలీ మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలు.. ఉట్నూర్ (M) అందోలికి చెందిన పారేకర్(34) 3 వారాలుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు పని చేసి ఇంటికి చేరుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి అతడికి వాంతులు, విరోచనాలు, ఛాతిలో నొప్పి రావడంతో ఇంద్రవెల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ADBకి తరలించే క్రమంలో మృతిచెందాడు. ఎండ తీవ్రతతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.
News April 2, 2025
ADB కలెక్టర్‌కు అవార్డ్.. సిబ్బందికి సన్మానం

ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ రాజర్షిషా వైవిధ్య ఆలోచన రూపమైన ఆరోగ్య పాఠశాల ప్రత్యేక కార్యక్రమానికి ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి స్కోచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి అవార్డు వచ్చేలా పనిచేసిన బృందాన్ని కలెక్టర్ మంగళవారం సన్మానించారు. ఇదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరంలోనూ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వారిని కోరారు.