News March 30, 2025

రాప్తాడు, కళ్యాణదుర్గం YCP ఇన్‌ఛార్జులపై కేసు

image

AP: రాప్తాడు, కళ్యాణదుర్గం వైసీపీ ఇన్‌ఛార్జులు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఉష శ్రీచరణ్‌లపై పెనుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 27న పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో వీరిద్దరూ పోలీసులను దూషించి, విధులకు ఆటంకం కలిగించారని, దౌర్జన్యం చేశారని చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు.

Similar News

News October 31, 2025

దేహంలో దాగి ఉన్న పంచభూతాల లీల

image

‘ఓం నమ:శివాయ’ అనే 5 అక్షరాలతో మనం శివుణ్ని కొలుస్తాం. ఈ పంచాక్షరీ మంత్రమే పంచభూతాలు కూడా. ఈ పంచభూతాల ఆధారంగానే మన శరీరం నిర్మితమైంది. దీనికి సూచనగా దేవుడు మన చేతికి, కాలికి సహజంగానే ఐదు వేళ్లను ఏర్పరిచాడు! ఆధ్యాత్మిక రహస్యాల్లో ఇదొకటి. మనిషి ఐదు వేళ్లను కలిగి ఉండటం, ఐదు భూతాలతో తయారవడం… ఇదంతా సృష్టికర్త మనకిచ్చిన దివ్య సంకేతం. మన శరీరమే పరమేశ్వరుని సృష్టిలో నిక్షిప్తమై ఉన్న అద్భుత రహస్యం! <<-se>>#SIVA<<>>

News October 31, 2025

కేజ్రీవాల్‌ మరో శీష్ మహల్ కట్టుకున్నారు: బీజేపీ

image

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మరో శీష్ మహల్ ఉందని BJP ఆరోపించింది. ఢిల్లీ మహల్‌ను ఖాళీ చేశాక చండీగఢ్‌లో 7 స్టార్ బంగ్లాను కేజ్రీవాల్ నిర్మించారని ట్వీట్ చేసింది. 2 ఎకరాల్లో ఉన్న ఈ భవనాన్ని పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కేటాయించిందని చెప్పింది. ఓ ఏరియల్ ఫొటోను షేర్ చేసింది. ఢిల్లీలో CM నివాసాన్ని ₹45 కోట్ల ప్రజాధనంతో శీష్ మహల్‌గా మార్చుకున్నారని గతంలో కేజ్రీవాల్‌పై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

News October 31, 2025

ప్రకాశం బ్యారేజ్‌లోకి 4.38L క్యూసెక్కుల వరద

image

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా 69 గేట్ల ద్వారా సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా నది తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 12.9 అడుగుల నీటి మట్టం ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా మొంథా తుఫాను ధాటికి చెరువులు, నదులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి.