News March 30, 2025

అనకాపల్లి: రక్షణ కోసం 24 గంటలు నిమగ్నమై ఉంటా- ఎస్పీ

image

అనకాపల్లి జిల్లాలో ముస్లింల రక్షణ కోసం 24 గంటలు నిమగ్నమై ఉంటానని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. శనివారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయన్నారు. 

Similar News

News July 5, 2025

MBNR: అరుణాచలానికి స్పెషల్ బస్.. ఫోన్ చేయండి

image

గురు పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈ నెల 8న రాత్రి 7గం.కు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సుజాత తెలిపారు. 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 10న రాత్రి అరుణాచలం చేరుకొని మరుసటి రోజు గిరిప్రదక్షిణ, 11న MBNRకు చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.3,600(ప్యాకేజ్) టికెట్ ధర ఉందన్నారు. వివరాలకు 94411 62588, 99593 26286లకు సంప్రదించాలన్నారు. SHARE IT

News July 5, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

image

నాగర్ కర్నూల్ జిల్లా సరిహద్దుల్లోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి శనివారం ఉదయం నాటికి 1,22,630 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 876.90 అడుగుల వద్ద 169.8650 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు 292 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 26,140 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News July 5, 2025

మొగల్తూరు: చేపకు మనిషి లాంటి దంతాలు

image

మొగల్తూరు సుబ్రహ్మణ్యేశ్వం రోడ్లో ఒక రైతుకు చెందిన చేపల చెరువులో రూపు చందు చేపల్లో ఒక చేప వింత పోలికలతో కనిపించింది. మనిషిని పోలిన దవడ పళ్లు ఉన్న చేప దొరికింది. ఇది హర్యానా జాతికి చెందిన చేపని మత్స్యకారులు అంటున్నారు. చేపల పెంపకం దారులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని లేదంటే వేళ్లను కొరికే ప్రమాదం ఉంటుందంటున్నారు.