News March 30, 2025

రాష్ట్రంలోని 51 మండలాల్లో కరవు

image

AP: రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో కరవు నెలకొన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రకాశం-17, కర్నూలు-10, వైఎస్సార్ కడప-10, అనంతపురం-7, నంద్యాల-5, శ్రీసత్యసాయి జిల్లాలోని 2 మండలాల్లో కరవు నెలకొన్నట్లు గుర్తించింది. వీటిలో 37 మండలాల్లో తీవ్ర, 14 మండలాల్లో మోస్తరు కరవు ఉన్నట్లు వివరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.

Similar News

News September 12, 2025

కొంతకాలం సోషల్ మీడియాకు దూరం: అనుష్క

image

సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి వెల్లడించారు. ‘నేను కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా. స్క్రోలింగ్‌ను పక్కన పెట్టి ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే మనందరి వాస్తవ ప్రపంచం అదే. అతి త్వరలో మీతో మరిన్ని స్టోరీలు పంచుకుంటా. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటా’ అని పోస్ట్ చేశారు. అనుష్క నటించిన ‘ఘాటీ’ ఇటీవలే విడుదలైంది.

News September 12, 2025

47 ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక

image

రాంచీలోని MECON లిమిటెడ్‌లో 47 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో అడిషనల్ ఇంజినీర్, Dy.ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులున్నాయి. ఉద్యోగానుభంతోపాటు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15, 16, 19, 20వ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అప్లికేషన్ ఫామ్, ఇతర పూర్తి వివరాల కోసం <>https://meconlimited.co.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

News September 12, 2025

దేవుళ్లను పుష్పాలతో ఎందుకు పూజించాలి?

image

మన నిత్య పూజలలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, పుష్పం మొదట్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరన శివుడు కొలువై ఉంటారు. అలాగే దాని రేకలలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. పుష్పాలలో నివసించే పరమాత్మ, పుష్పాలతోనే పూజ చేస్తే ప్రసన్నుడవుతాడు. అందుకే పూలను త్రివర్గ సాధనంగా చెబుతారు. పుష్పాలను దైవారాధనకు ఉపయోగించడం ద్వారా సంపద, మోక్షం వంటివి లభిస్తాయని నమ్మకం.