News March 30, 2025

GDWL: నేడు, రేపు పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

image

ఆది, సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో 30, 31 సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు.

Similar News

News July 7, 2025

సూళ్లూరుపేటలో వ్యభిచార గృహాలపై దాడులు

image

సూళ్లూరుపేటలోని పలు లాడ్జీలలో ఆదివారం పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ దాడుల్లో ఓ నిర్వాహకురాలితోపాటు, ఇద్దరు మహిళలు, ఒక విటుడుని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News July 7, 2025

వరంగల్: కోరికలు తీరాలని తాళం వేస్తారు!

image

ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన సాంప్రదాయం ఉంటుంది. అలాగే, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గాలో యాకుబ్ షావలి బాబా దర్శనానికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరాలని దర్గాలోని గ్రిల్స్‌కు తాళం వేస్తారు. కోరికలు నెరవేరిన అనంతరం దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి కులమతాలకతీతంగా వచ్చే భక్తులు ఈ ఆనవాయితీని పాటిస్తుండటం విశేషం. ప్రతి శుక్రవారం, ఆదివారం భక్తులు కిక్కిరుస్తారు.

News July 7, 2025

భద్రాద్రి: ‘ఎకో వారియర్’ తయారీలో ‘స్ఫూర్తి’

image

మణుగూరు పట్టణానికి చెందిన స్ఫూర్తి అనే యువతి పర్యావరణహిత వాహనాన్ని తయారు చేశారు. తండ్రి మెకానిక్, సోదరుడు ఎలక్ట్రీషియన్ కావడంతో చిన్ననాటి నుంచి సాంకేతికత పట్ల అవగాహన పెంచుకుంది. ప్రభుత్వ ITIలో ఏటీసీ విద్యను అభ్యసిస్తున్న ఆమె అధ్యాపకుల ప్రోత్సాహంతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల పాత ఇనుప దుకాణంలో సామాన్లను సేకరించి రూ.40 వేల ఖర్చుతో ‘ఎకో వారియర్’ వాహనాన్ని రూపొందించారు.