News March 30, 2025
రేపు పోలీస్ ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక రద్దు

ప్రతి సోమవారం జరిగే పోలీసు ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. మరల వచ్చే సోమవారం యధావిధిగా ఈ ప్రజా ఫిర్యాదు పరిష్కార కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
Similar News
News April 2, 2025
ఐఏబీ నిర్వహించాలని సోమిరెడ్డి లేఖ

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో రెండో పంట కోసం ఐఏబీ సమావేశం నిర్వహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండీ ఫరూక్, కలెక్టర్ ఆనంద్కు లేఖ రాశారు. ప్రస్తుతం సోమశిలలో 53.374 టీఎంసీలు, కండలేరులో 48.517 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. రెండో పంటకు నీటి కేటాయింపులకు సంబంధించి ఐఏబీ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలన్నారు.
News April 2, 2025
నెల్లూరు: రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం

నెల్లూరు జిల్లాలో బిట్రగుంట-పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించిన దొంగల ముఠా రెండు రైళ్లను ఆపి దోపిడీ చేసింది. అర్ధరాత్రి సమయంలో బెంగళూరు, చండీగఢ్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపారు. బోగీల్లోకి ప్రవేశించి మహిళల మెడలోని బంగారం గొలుసులు, బ్యాగులను దోచుకెళ్లారు.
News April 2, 2025
నెల్లూరు : 3 నుంచి పది మూల్యాంకనం

పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు నగరంలోని దర్గామిట్ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు డీఈవో బాలాజీ రావు తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు చేపడుతున్నారని, సిబ్బంది నియామకాలను కూడా పూర్తి చేస్తున్నామన్నారు. ఈ నెల 2 వతేదీ సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులకు, సిబ్బందికి విధులు కేటాయిస్తామన్నారు.