News March 30, 2025

పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం.. భట్టిVSపొంగులేటి

image

పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం నియామకం Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య రాజకీయ ఆధిపత్యానికి దారి తీసింది. Dy.CM చొరవతో ఆలయ ఛైర్మన్‌గా జమ్ముల రాజశేఖర్, సభ్యులను నియమిస్తూ మార్చి 6న ఉత్తర్వులు వెలువడ్డాయి. తనకు తెలియకుండా ఎలా నియమిస్తారని మంత్రి సురేఖను పొంగులేటి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరో లిస్టు రెడీ చేశారని.. పాలకవర్గం నియామకం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 13, 2026

రైతులకు ఊరట.. జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు

image

ఖమ్మం జిల్లాలో సాగు సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,844 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల దుకాణదారులు ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 13, 2026

నేడు ‘మంచుకొండ’ ఎత్తిపోతల పథకం ప్రారంభం

image

రఘునాథపాలెం మండల రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. ప్రభుత్వం నిర్మించిన ‘మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని’ నేడు ప్రారంభించనున్నారు. రూ. 66.33 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 37 చెరువులను నింపుతూ సుమారు 3,500 ఎకరాలకు సాగర్ జలాలు అందనున్నాయి. 2025 జనవరిలో శంకుస్థాపన చేసిన ఈ పథకాన్ని, మంత్రి తుమ్మల చొరవతో ఏడాదిలోనే పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రైతులకు అంకితం చేస్తున్నారు.

News January 12, 2026

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: DAO

image

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 9,844 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎటువంటి కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు అన్ని మండలాల్లో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 32,793 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.