News March 30, 2025
NLG: 31 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయి

ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) క్రమబద్ధీకరణ 25 శాతం రాయితీ ఇచ్చినందున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ప్రకాశ్ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిపునకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందని, అదే రోజు సెలకు సెలవు దినమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
కడప ఎంపీ.. హాజరులో చివరి స్థానం

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరులో 54.41 శాతంతో చివరి స్థానంలో ఉన్నారు. 80 ప్రశ్నలను సభలో అడిగగా.. 5 చర్చల్లో మాత్రమే ఆయన పాల్గొన్నారు.
News September 15, 2025
పవర్‌గ్రిడ్‌లో 866 అప్రంటిస్‌లు.. AP, TGలో ఎన్నంటే?

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 866 అప్రంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్‌భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పోస్టును అనుసరించి స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. అక్టోబర్ 6లోగా powergrid.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.
News September 15, 2025
ధర్మవరం మహిళ హత్య కేసులో భర్త అరెస్ట్

ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సాకే సరస్వతి అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో భర్త వెంకటరాముడు హత్య చేశాడని టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఆయన వివరాల మేరకు.. రెండు నెలల క్రితం సరస్వతిని ఆమె భర్త వెంకటరాముడు బంధువులతో కలిసి హత్య చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్ల పల్లి వంక పక్కన శవాన్ని పూడ్చిపెట్టారు. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.