News March 30, 2025

హైదరాబాద్ నుంచి వెళ్లిపోతాం: SRH ఆవేదన

image

ఉచిత పాస్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ప్రతినిధి HCA కోశాధికారికి లేఖ రాశారు. కోరినన్ని పాస్‌లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్లు పేర్కొన్నారు. టికెట్ల విషయంలో HCA అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని, ఇలాగే కొనసాగితే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు.

Similar News

News July 5, 2025

నిరాశ వద్దు మిత్రమా.. విజయం తథ్యం!

image

మీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయని నిరాశ చెందుతున్నారా? తిరస్కరణలు, నష్టాలు మీకు అడ్డంకులు కావు.. అవి ప్రక్రియలో భాగం అని తెలుసుకోండి. యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్ బీస్ట్ వైరల్ అవ్వకముందు 455 వీడియోలు అప్లోడ్ చేశారు. ఆర్టిస్ట్‌గా ఫేమస్ కాకముందు పికాసో 20 వేల పెయింటింగ్స్ వేశారు. కల్నల్ సాండర్స్ KFC ఏర్పాటు చేయకముందు 1009 సార్లు ఫెయిల్ అయ్యారు. మీలా వీళ్లు కూడా అనుకుంటే సక్సెస్ అయ్యేవారా ఆలోచించండి.

News July 5, 2025

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఏపీతో జలవివాదం నేపథ్యంలో జల్‌శక్తి మినిస్టర్‌ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

News July 5, 2025

ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

image

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.