News March 30, 2025

రాయచోటిలో కానిస్టేబుల్ సస్పెండ్

image

రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రామాంజులును ఎస్పీ విద్యాసాగర్ సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాడ శిబిరాల నిర్వహణకు సహకరించి, డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వినిపించాయి. దాంతో పాటు ఓ సారి స్పెషల్ పోలీసులు శిబిరాలపై దాడి చేయగా.. వారిలో రామాంజులు కూడా ఉండడంతో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అందినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు.

Similar News

News January 15, 2026

కనుమ రోజున ప్రయాణాలు చేయవద్దా? దీని వెనుక ఉద్దేశం?

image

కనుమ రోజున ప్రయాణాలు చేయొద్దనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. ఈ రోజును పశువుల పండుగగా జరుపుతారు. పంటల సాగులో సాయపడిన పశువులను పూజిస్తారు. అయితే పూర్వం ఎడ్ల బండ్లపై ప్రయాణాలు చేసే వారు కాబట్టి ఈ ఒక్కరోజైనా ఎద్దులను కష్టపెట్టొద్దనే ఉద్దేశంతో ప్రయాణాలు వద్దని చెప్పేవారని పండితులు గుర్తుచేస్తున్నారు. కాగా ప్రస్తుత కాలంలో ఈ నియమం వల్ల కుటుంబమంతా కలిసి గడిపేందుకు ఎక్కువ సమయం ఉంటుందంటున్నారు.

News January 15, 2026

సూర్యపై కామెంట్స్.. నటిపై రూ.100 కోట్ల దావా

image

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ తరచూ మెసేజ్ చేస్తున్నాడన్న నటి <<18721618>>ఖుషీ<<>> ముఖర్జీపై SKY అభిమాని అన్సారీ చర్యలకు దిగారు. నటి వ్యాఖ్యలను ఖండిస్తూ రూ.100 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేశారు. నటికి సూర్య కుమార్ మెసేజులు చేశారనడం పూర్తిగా తప్పని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఖుషీకి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.

News January 15, 2026

BREAKING: సంగారెడ్డి: అడవిలో విషపు కాయలు తిని చిన్నారులకు అస్వస్థత

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రామచంద్రాపురం పరిధి బండ్లగూడలో బిహార్‌కు చెందిన 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు స్థానిక అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లకు ఉన్న విషపు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించగా అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.