News March 30, 2025
NGKL: దిగుబడి రాలేదని కౌలు రైతు ఆత్మహత్య

మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవల్ తిరుమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనమోని శ్రీనివాసులు అనే రైతు కల్వకుర్తి మండలం వేపూరు గ్రామంలో మామిడి తోటను కౌలు చేస్తున్నాడు. దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News November 10, 2025
అవినీతికి పాల్పడితే చర్యలు: కలెక్టర్

వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ జేడీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, అర్హులకు వాటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎవరన్నా అవినీతికి పాల్పడితే చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
News November 10, 2025
మిర్యాలగూడలో అమానుషం.. కుక్క నోట్లో మృత శిశువు లభ్యం

మిర్యాలగూడలో అమానుషం చోటుచేసుకుంది. సబ్ జైల్ రోడ్డులో కుక్క నోట్లో కరచుకున్న నెలలు నిండని మృత శిశువు లభ్యమైంది. పోలీసులకు సమాచారం అందించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆడశిశువు కావడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలపై భిన్నాభిప్రాయాలు

మహిళా క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగాలిచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవించాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాకుండా స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలివ్వడంపై పలువురు ఫైరవుతున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగానే ప్రభుత్వాల నిర్ణయాలని కొందరు సమర్థిస్తున్నారు.


