News March 30, 2025
RKP: అమ్మాయి కోసం యువకుడి సూసైడ్

ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రామకృష్ణాపూర్‌లో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. అబ్రహంనగర్‌కి చెందిన వినయ్(26) ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనకు ఆమెతో పెళ్లి చేయాలని తల్లికి చెప్పడంతో ఉద్యోగం వచ్చాక పెళ్లి చేస్తానని వినయ్ తల్లి సముదాయించింది. కాగా, తనకు ఉద్యోగం లేకపోవడంతో ఆ అమ్మాయిని ఎలా పోషించాలని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News November 7, 2025
VKB: మూసీ జన్మస్థలం.. ఔషధ జలధార!

అనంతగిరి అడవి ఔషధ గుణాల నిలయంగా విరాజిల్లుతుంది. అనంతగిరి అడవిలో పెరిగే వేలాది మొక్కల వేర్ల నుంచి వడపోతకు గురయ్యే స్వచ్ఛమైన జలమే మూసీ నదికి ఆధారం. నిజాం కాలంలో టీబీ రోగుల చికిత్సకు ఈ కొండల్లో ఆసుపత్రిని నిర్మించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఇదే. పువ్వుల పుప్పొడి, పచ్చని చెట్ల ఫైటో న్యూట్రియంట్స్‌తో కూడిన స్వచ్ఛమైన గాలి, ఔషధ జలధార ఆరోగ్యానికి సంజీవనిగా పనిచేస్తాయని నాటి వైద్యులు నమ్మేవారు.
News November 7, 2025
ప్రకాశం: భారీగా పెరిగిన పొగాకు ధర.. కానీ!

ప్రకాశం జిల్లాలో పొగాకు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న వేలం ప్రారంభమప్పుడు గరిష్ఠ ధర KG రూ.280గా ఉంది. తర్వాత క్రమంగా పెరిగింది. తుఫాన్ ముందు రూ.315 ఉండగా వారం లోపే ప్రస్తుతం రూ.362కి చేరింది. వేలం ముగింపు వేళ ధర పెంచి.. వచ్చే సీజన్‌లో రైతులు ఎక్కువ సాగు చేసేలా కంపెనీలు కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. హైగ్రేడ్ ధరలు పెరిగినప్పటికీ లోగ్రేడ్ కేజీ రూ.150 నుంచి రూ.50కి పడిపోవడం గమనార్హం.
News November 7, 2025
తూ.గో: ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

సబ్బవరంలోని ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామచంద్ర రావు తెలిపారు. తూ.గో జిల్లా సీతానగరం మండలానికి చెందిన పి.వీరబాబు (19)గా గుర్తించారు. గురువారం వీరబాబు డిఫెన్స్ అకాడమీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


