News March 30, 2025
అనంత: ఉగాది, రంజాన్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

నేడు ఉగాది, రేపు రంజాన్ పండుగ సందర్భంగా అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ రూ.180-190గా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150తో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700 నుంచి రూ.750గా ఉంది.
Similar News
News April 2, 2025
అనంత: హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన సిద్దయ్యకు జీవిత ఖైదీ విధిస్తూ అనంతపురం నాలుగవ ఏడీజే కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అనంతపురం 4 రోడ్డుకు చెందిన రామాంజినమ్మ ఫిబ్రవరి 2014న మిస్సింగ్‌పై భర్త రవి ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సిద్దయ్య ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశాడు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ జగదీష్ అభినందించారు.
News April 2, 2025
రెండో విడత రీ-సర్వే పనులు పూర్తికి కృషి: కలెక్టర్

విజయవాడ సీసీఎల్ కార్యాలయం నుంచి బుధవారం రెవెన్యూ సదస్సుల పీజీఆర్ఎస్ రీ సర్వే ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ తదితర అంశాలపై అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు సీసీఎల్ఏ నక్కల ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. ఫ్రీ హోల్డ్ రెండో విడత రీ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
News April 2, 2025
అనంతపురం జిల్లాలో HM సస్పెండ్

అనంతపురం జిల్లా ఆత్మకూరు ZPHS హెచ్ఎం శ్రీనివాస్ ప్రసాద్‌పై పాఠశాల విద్య కడప RJD శామ్యూల్ మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు ZPHSలో పరీక్ష రాసేందుకు 10th విద్యార్థిని వెళ్లింది. పరీక్ష జరిగే సమయంలో ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం మిస్ అయిందని చెప్పగా.. చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆమెను భుజంపై కర్రతో కొట్టారు. దీంతో విద్యార్థిని కాలర్ బౌన్ విరిగగా ఆయనను సస్పెండ్ చేశారు.