News March 30, 2025
పిఠాపురం పోలీసులపై జిల్లా ఎస్పీ సీరియస్

ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలపై కాకినాడ జిల్లా ఎస్పీ విందు మాధవ్ పిఠాపురం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం రూరల్ ఎస్‌ఐ లంచం తీసుకోవడం, ఒక కేసులో అనుమానితుడు జీపు డ్రైవర్‌గా ఉండటం పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉండటం, కొన్ని కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడంపై ఎస్పీ బిందు మాధవ్ పిఠాపురం పోలీసులపై సీరియస్ అయ్యారు.
Similar News
News March 2, 2026
పులి సంచారంపై భయాందోళన వద్దు: కలెక్టర్

పోలవరం జిల్లాలోని వేములకొండ, అకూరు గ్రామాల్లో పులి సంచారంపై భయాందోళన చెందవద్దని కలెక్టర్ దినేశ్ కుమార్ భరోసా ఇచ్చారు. సోమవారం సాయంత్రం తమ గోడు వెళ్లబోసుకున్న గ్రామస్థులతో ఆయన మాట్లాడారు. అటవీ అధికారుల పర్యవేక్షణలో పులి కదలికలను గమనిస్తున్నామని, అది జనవాసాల్లోకి రాదని స్పష్టం చేశారు. అటవీ శాఖతో నిరంతరం సంప్రదిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News March 2, 2026
ములుగు ప్రజావాణిలో 59 వినతులు

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి 59 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, పింఛన్ల కోసం 14, ఉద్యోగ కల్పనకు 4, ఇతర సమస్యలపై 13 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచకూడదన్నారు.
News March 2, 2026
KMR: రాహుల్ గాంధీ మూటల కోసం వచ్చారు: కేంద్ర మంత్రి

రాహుల్ గాంధీ శిక్షణా తరగతుల పేరుతో హైదరాబాద్‌కు వచ్చింది కేవలం మూటల కోసమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూసీ సుందరీకరణ కోసం ఇండ్లను కూల్చివేసిన బాధితుల ఇండ్ల వద్దకు రాహుల్ గాంధీ వెళ్లాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల ప్రాంతాలను, ఖమ్మంలోని ప్రాంతాలను సందర్శించాలన్నారు.


