News March 30, 2025
MDK: ‘25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’

ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారు పూర్తిస్థాయిలో రుసుము చెల్లించి ప్లాట్‌ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన వారికి ప్రభుత్వం 25% రాయితీని వర్తింపజేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 12, 2026
వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: కలెక్టర్

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.
News January 12, 2026
జాతీయస్థాయికి 11 మంది మెదక్ క్రీడాకారులు

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15, పోటీలలో 13 జిల్లాలకు చెందిన బాల, బాలికలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బాలికల టీం రెండో స్థానం కైవసం చేస్తుందని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.
News January 12, 2026
MDK: పోలీసుల అప్రమత్తతతో తప్పిన విషాద ఘటన

ఏడుపాయల వనదుర్గామాత ఆలయం సమీపంలోని ఘనపూర్ ఆనకట్ట వద్ద కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్యను QRT-1 టీమ్ ప్రాణాలకు తెగించి కాపాడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న QRT-1 సిబ్బంది ఏఆర్ ఎస్‌ఐలు శ్రీనివాస్, సాయిలు తదితరులు నది ప్రవాహంలోకి వెళ్లి తాడు సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారి ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసించారు.


