News March 30, 2025
నిర్మల్: ఇంటర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ డేనియల్ తెలిపారు 2025- 26 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష మే 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
4 బంతుల్లో 3 వికెట్లు

మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడమ్ మిల్నే అదరగొట్టారు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టెక్సాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 19వ ఓవర్‌లో తొలి 2 బంతులకు 2 వికెట్లు పడగొట్టిన అతడు 4వ బంతికి మరో వికెట్ తీసి సియాటెల్‌ను ఆలౌట్ చేశారు. దీంతో మొత్తం ఆ ఓవర్‌లో 4 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ 188 రన్స్ చేయగా ఛేజింగ్‌లో సియాటెల్ 137 పరుగులకే కుప్పకూలింది.
News July 6, 2025
JNTU: ఈ ఏడాది నుంచి 164 క్రెడిట్స్ అమలు

2025-26 విద్యా సంవత్సరానికి గాను జేఎన్టీయూ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 160 క్రెడిట్స్ వస్తేనే పట్టా ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 164 క్రెడిట్స్‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాటిలో 4 మినహాయించి 160 క్రెడిట్స్ వస్తేనే డిగ్రీ అందజేయనున్నారు. ఏదైనా కారణాలతో బీటెక్‌ను వదిలేస్తే కోర్సు పూర్తి చేసేందుకు 8 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
News July 6, 2025
గజ్వేల్: వృద్ధురాలిని చంపిన వ్యక్తి అరెస్టు

వృద్ధురాలిని హత్య చేసి బంగారు, వెండి వస్తువులను దొంగలించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోమటిపల్లికి చెందిన కిచ్చిగారి శివశంకర్(36)ను వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. గత నెల 26న ధర్మారెడ్డిపల్లికి చెందిన నల్ల సత్తెమ్మను కొడవలితో నరికి చంపి మెడలోని బంగారు చైన్, చెవి కమ్ములను అపహరించుకుపోయినట్లు ఏసీపీ వివరించారు.