News March 30, 2025

NZB: దరఖాస్తుకు రేపే చివరి తేదీ

image

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజర్వేషన్, నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News July 9, 2025

NZB: రైతుల్లో చిగురించిన ఆశలు..!

image

NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

News July 9, 2025

NZB: దైవ దర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం.. ASI భార్య మృతి

image

NZB కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో NZB పోలీస్ ఇంటలిజెన్స్‌‌లో పనిచేస్తున్న ASI భీమారావు భార్య భవాని మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. భవాని తన కుమారుడితో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా వారి బైక్‌కు కుక్క అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న భవాని మృతి చెందారు.

News July 9, 2025

SRSPలో తగ్గిన వరద నీటి ప్రవాహం

image

మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవక పోవటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ ఫ్లో రావడం లేదు. గడిచిన 24 గంటల్లో కేవలం 4291 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80TMCలు) కాగా, ప్రస్తుతం 1067 అడుగులు (19.537 TMCలు) మాత్రమే నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్పటి వరకు కేవలం 8.857 TMCల నీరు మాత్రమే వచ్చి చేరింది.