News March 30, 2025
కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

సుల్తానాబాద్(M) గర్రెపల్లిలో SRCL(D) తంగళ్లపల్లి(M) చీర్లవంచకు చెందిన పత్రి కళావతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గంగాధర పంచాయతీ కార్మికుడు షాహిద్(28) గుండెపోటుతో మరణించాడు. JGTL(M) తిప్పన్నపేటకు చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య(58) విద్యుదాఘాతంతో చనిపోయాడు. తంగళ్లపల్లి(M) బస్వాపూర్‌కు చెందిన బంటు ఆనందం చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. KNRలోని రేకుర్తిలో చెరువులో పడి శ్రీనిధి అనే <<15924920>>బాలిక<<>> చనిపోయింది.
Similar News
News February 26, 2026
కరీంనగర్ బస్టాండ్‌లో లగేజీ బ్యాగు లభ్యం

కరీంనగర్ బస్టాండ్ పోలీస్ అవుట్‌పోస్ట్ పరిధిలో పది రోజుల క్రితం ఒక సూట్‌కేసు లభ్యమైంది. అందులో విలువైన దుస్తులు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆధార్ కార్డు ఉన్నాయి. కార్డులోని ఫోన్ నంబర్‌కు పోలీసులు ప్రయత్నించగా సిగ్నల్ అందడం లేదు. బాధితులు 9440469543, 8712580332 నంబర్లలో సంప్రదించి, ఆధారాలు చూపి బ్యాగును తీసుకెళ్లాలని అవుట్‌పోస్ట్ పోలీసులు కోరారు.
News February 26, 2026
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రా

కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న పమేలా సత్పతిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం, కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్ర మిశ్రాను నియమించారు. ప్రస్తుతం ఆమె ITDA ఏటూరునాగారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ చిత్ర మిశ్రా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 25, 2026
KNR: ‘మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’

అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం – 2013 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లోకల్ కమిటీ మెంబర్ రాజా రెడ్డి ఈ చట్టంపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం ఈ చట్టం ఎంత ముఖ్యమో వివరించారు.


