News March 30, 2025

సిరిసిల్ల: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

సుల్తానాబాద్(M) గర్రెపల్లిలో SRCL(D) తంగళ్లపల్లి(M) చీర్లవంచకు చెందిన పత్రి కళావతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తంగళ్లపల్లి(M) బస్వాపూర్‌కు చెందిన బంటు ఆనందం చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. గంగాధర పంచాయతీ కార్మికుడు షాహిద్(28) గుండెపోటుతో మరణించాడు. JGTL(M) తిప్పన్నపేటకు చెందిన చింతకుంట్ల రాజనర్సయ్య(58) విద్యుదాఘాతంతో చనిపోయాడు. KNRలోని రేకుర్తిలో చెరువులో పడి శ్రీనిధి అనే <<15924920>>బాలిక<<>> చనిపోయింది.

Similar News

News January 16, 2026

నేడు ఫిరాయింపు MLAల కేసు విచారణ

image

TG: నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కేసును జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం విచారించనుంది. 2023 ఎన్నికల్లో గెలిచిన 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరినట్లు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే <<18864508>>నిర్ణయం<<>> తీసుకున్నారు. ఈ విషయాన్ని 3 నెలల్లో తేల్చాలంటూ గతంలో సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.

News January 16, 2026

ఆరోగ్యం కోసం.. రోజూ ఉదయాన్నే ఇలా చేయండి

image

రోజును సరైన పద్ధతిలో ప్రారంభించడం ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు. 10 నిమిషాల పాటు చేసే చిన్న అలవాట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే శరీరం హైడ్రేట్ అవుతుందని, ఖాళీ కడుపుతో కాఫీ/టీ తాగొద్దని సూచిస్తున్నారు. అదే విధంగా తేలికపాటి వ్యాయామం, మెడిటేషన్ చేస్తే గుండె, మెదడు పని తీరుతో పాటు పేగుల కదలికలను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.

News January 16, 2026

కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.