News March 30, 2025
ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్‌లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 2, 2025
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా

వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందని అమిత్‌షా స్పష్టం చేశారు. దీని ద్వారా వక్ఫ్ ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేయవచ్చన్నారు. ఈ బిల్లును చర్చి బోర్డులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అవినీతికి తప్ప ఏ మతానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. దీని ద్వారా మతాల మధ్య ఘర్షణ సృష్టించాలనే ఆలోచన తమకు లేదని ఆయన వివరించారు. ఈ బిల్లును తాము రాజ్యాంగబద్ధంగానే రూపొందించామని వెల్లడించారు.
News April 2, 2025
ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు

ఇండియన్ నేవీ ‘అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్’ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు పాసై 2004 సెప్టెంబర్ 1-2008 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికే పర్మినెంట్ జాబ్. జీతం తొలి నాలుగేళ్లు రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉంటుంది. ఈ నెల 10లోగా https://www.joinindiannavy.gov.in/లో అప్లై చేసుకోవాలి.
News April 2, 2025
ప్రపంచానికే సాయం.. భారత్ విపత్తు దౌత్యం

ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే విపత్తు సంభవించిందంటే మొట్ట మొదటిగా భారతే స్పందిస్తుంది. 1959లో టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడం నుంచి నిన్న మొన్నటి మయన్మార్ భూకంపంలో ‘ఆపరేషన్ బ్రహ్మ’ వరకు భారత్ చేసిన సాయం అంతాఇంతా కాదు. దీన్ని ‘విపత్తు దౌత్యం’గా విదేశీ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ దౌత్యంతో కుదరని బలమైన సంబంధాల్ని ఈ దారిలో భారత్ సాధిస్తోందని కొనియాడుతున్నారు.