News March 30, 2025

Breaking: గద్వాల: చట్నీలో బల్లి

image

గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో బల్లి పడ్డ చట్నీ తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. పట్టణ ఎస్ఐ కళ్యాణరావు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం టిఫిన్ సెంటర్‌ను ఎస్ఐ తనిఖీ చేసి హోటల్ యజమాన్యాన్ని స్టేషన్‌కు తరలించారు.

Similar News

News November 14, 2025

జూబ్లీ కౌంటింగ్: దద్దరిల్లనున్న హైదరాబాద్

image

రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన ఫలితం నేడు వెలువడనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజేత ఎవరు? అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్ వైపు చూపినా.. కొన్ని సర్వేలు BRSకు అనుకూలంగా వచ్చాయి. ఇవి ఎగ్జాక్ట్ కాకపోయినా పోలింగ్‌లో సైలెంట్ ఓటింగ్ కీలకంగా మారింది. మధ్యాహ్నం లోపు విజయం తేలనుండడంతో సంబరాలకు శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఎవరు గెలిచినా నగరం హోరెత్తనుంది.

HYD: ఉ.11.30 గంటల్లోపే విజేతపై క్లారిటీ!

image

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనుండగా మొదటి గంటన్నరలోపే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ముందు పోస్టల్ బ్యాలెట్ ఆ తర్వాత EVMలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఉ.11.30లోపు విజేత ఎవరో క్లారిటీ రావొచ్చని అంచనా. గెలుపుపై అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష BRS ధీమా ఉండగా పట్టు నిలుపుకునేందుకు BJP చూస్తోంది.